ఆహారం తినేటప్పుడు నీరు త్రాగడం మంచిదా? కాదా?

గురువారం, 14 జులై 2016 (13:42 IST)
సాధారణంగా ప్రతి ఒక్కరూ ఆహారం తీసుకునేందుకు ముందు లేదా మధ్యలో నీరు తాగుతుంటారు. ఇలా తాగడం మంచిదా కాదా అనే అంశంపై నెదర్లాండ్‌కు చెందిన ఓ వర్శిటీ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. ఇందులో ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. ఆహారం తీసుకునేటప్పుడు మెదడు, పొట్ట, తినేవారిలో సంతృప్తి భావనల్ని వాస్తవిక రీతిలో పరిశీలించారు. 
 
భోజనం చేసేటప్పుడు నీరు ఎక్కువగా తాగితే.. కడుపు నిండిందనే సంకేతాలు మెదడుకు చేరి... ఆకలికి అడ్డుకట్ట పడుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. దీనివల్ల ఆహారం తీసుకునేటప్పుడు పొట్ట మాటల్ని మెదడు వినే విషయంలో శాస్త్రవేత్తలకు కొత్త మార్గాలకు దారి చూపినట్లవుతుందని భావిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి