ప్రస్తుతం కాలంతో పాటు.. మనిషి కూడా పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నాడు. ముఖ్యంగా.. ఇంట్లోనే కాకుండా, ఆఫీసుల్లో, చివరకు ప్రయాణం చేసే సమయంలోనూ మనిషి ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. ఇలాంటి సమయంలో కాస్తంత రిలాక్స్ పొందాలంటే చిన్నపాటి టెక్నిక్స్‌ను పాటిస్తే చాలు. అవేంటో పరిశీలిద్ధాం.
నుదుటిపై బొట్టు పెట్టుకునే భాగంలో చేత్తో మసాజ్ చేయడం వల్ల ఒత్తిడి నుంచి తక్షణం ఉపశమనం పొందవచ్చు. ఇలా చెయ్యడం వల్ల రిలాక్స్ అవ్వడమే కాదు, చేసే పనిపై ఏకాగ్రత కూడా పెరుగుతుందట. అలాగే, తల నొప్పి తగ్గడం, కంటి భాగం దగ్గరి చర్మాన్ని రిలాక్స్ అవుతాయి.
అయితే, బొట్టుపెట్టుకునే భాగంలో మసాజ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. బొట్టుపెట్టుకునే భాగాన్ని ఏదైనా ఒక వేలితో సున్నితంగా నొక్కి పట్టుకోవాలి. అక్కడ నుంచి పైకి, కిందికి, చుట్టుపక్కల వేలితో స్పృసిస్తూ మెల్లగా మసాజ్ చెయ్యాలి.
అలా కొన్ని నిమిషాల పాటు చేయడం వల్ల ఎంతో హాయిగా ఉండటమే కాకుండా, ఒత్తిడి నుంచి కాస్తంత రిలీఫ్ అయిన భావన కలుగుతుంది. ప్రధానంగా మెదడులోని నరాలపై ఉండే టెన్షన్ తగ్గిపోతుందట. కంటి చూపులో కూడా స్పష్టత వస్తుందట.