వేడిపాలలో కొద్దిగా శొంఠి పొడి, ఏలకుల పొడి వేసుకొని తాగితే...

శనివారం, 28 మార్చి 2020 (22:04 IST)
కంప్యూటర్‌పై పనిచేసేటప్పుడు మానిటర్ సరిగ్గా మన కళ్లకు ఎదురుగా ఉండాలి. తల ఎత్తి లేదా దించి చూడాల్సి వచ్చేట్టుగా ఉండినట్లైతే మెడ నొప్పి వస్తుంది.
 
రోజువారీ ఆహారంలో ఇనుము ఉండేలా చూసుకొంటే మాటిమాటికీ నిస్సత్తువ దరికిరాదు. పాలకూర, తోటకూర వంటివాటిలో ఇనుము సమృద్ధిగా అందుతుంది. 
 
నిద్రపోయే ముందు ఒక గ్లాసు వేడిపాలలో కొద్దిగా శొంఠిపొడి, ఏలకుల పొడి వేసుకొని తాగాలి. ఏలకులు పిత్తాన్ని, అల్లం కఫాన్ని తొలగిస్తాయి.
 
బాగా నమిలి తినడం ద్వారా ఉబ్బరం సమస్య చాలా వరకు దూరంగా ఉంటుంది. దంతాలు పూర్తిగా పోయిన వారు కృత్రిమ దంతాలు వాడటం చాలా అవసరం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు