కాకరకాయ జ్యూస్‌తో ఆ సమస్య మటుమాయం..?

సోమవారం, 10 డిశెంబరు 2018 (16:09 IST)
కాకరకాయ జ్యూస్‌లో న్యూట్రియన్స్, ఐరన్, మెగ్నిషియం, విటమిన్ సి, పొటాషియం వంటి ఖనిజాలు ఎక్కువగా ఉన్నాయి. కాకరకాయ డైట్‌కి మంచిగా పనిచేస్తుంది. కాకరకాయలోని క్యాల్షియం, బీటా కెరోటిన్ వంటి లవణాలు మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుతాయి. కనుక ప్రతిరోజూ ఉదయాన్నే గ్లాస్ కాకరకాయ జ్యూస్ తీసుకుంటే వ్యాధి నుండి ఉపశమనం లభిస్తుంది.
 
కాకరకాయ జ్యూస్‌లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చెడు కొలెస్ట్రాల్‌‍ను తగ్గిస్తాయి. దాంతో గుండెపోటు, రక్తపోటు వంటి సమస్యలు దరిచేరే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కాకరకాయలోని పొటాషియం రక్తపోటు వ్యాధికి చాలా ఉపయోగపడుతుంది. తద్వారా గుండెలోని వ్యర్థాలు తొలగిపోతాయి. 
 
కాకరకాయ జ్యూస్ తలకు రాసుకుంటే జుట్టు రాలే సమస్య ఉండదు. ఇంకా చెప్పాలంటే చుండ్రు, పొడిబారిన జుట్టుకు ఈ జ్యూస్ వాడితే మంచి ఫలితాలు పొందవచ్చును. ఒట్టి కాకరకాయ జ్యూస్ తలకు రాసుకోలేకుంటే.. అందులో కొద్దిగా పెరుగు కలిపి రాసుకున్న జుట్టు రాలకుండా.. పట్టుకుచ్చులా పెరుగుతుంది. ఈ జ్యూస్ జుట్టుకు కండీషనర్‌లా పనిచేస్తుంది. 
 
కాకరకాయ జ్యూస్ ఇమ్యూనిటీ పవర్‌ను కూడా పెంచుతుంది. కాకరకాయ జ్యూస్ తీసుకుంటే.. శరీరంలో క్యాలరీలు, కార్బొహైడ్రేట్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఈ రెండు పదార్థాలు శరీర బరువు పెంచేందుకు దోహదపడుతాయి. కానీ, కాకరకాయలో ఇవి చాలా తక్కువగా ఉన్నాయి. కనుక కాకరకాయ జ్యూస్ క్రమంగా తీసుకోండి.. బరువు తప్పకుండా తగ్గుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు