ప్రస్తుతం యూత్‌ని విపరీతంగా వేధిస్తున్న సమస్య జట్టురాలడం. మారుతున్న వాతావరణానికి అనుగుణంగా బట్టతల రాకుండా, జుట్టు ఊడకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా నష్టం వాటిల్లుతూనే ఉంది. కొంతమందిలో 30 సంవత్సరాలకే సగం జుట్టు పోయి బట్ట తల సమస్యను ఎదుర్కొంటున్నారు. బట్టతలపై జుట్టును రాబట్టుకోవడం దాదాపు అసాధ్యంతో కూడుకున్న పని అలా రాబట్టుకోవాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది. అయితే ఖర్చు చేయకుండా సులభంగా జుట్టును రాబట్టుకోవచ్చు. చిన్న చిన్న ఇంటి చిట్కాలును పాటించడం వల్ల కోల్పోయిన జుట్టును తిరిగి పొందవచ్చు.
ఎండిన ఉసిరికాయలను తీసుకుని నీళ్లల్లో రాత్రంతా కూడా నానబెట్టాలి. అలా నానబెట్టిన నీటిలోనే ఉసిరికాయల గుజ్జును పిండాలి. ఆ నీటిని తలకు బాగా పట్టించి, గంట సమయం ఉండాలి. ఆ తర్వాత చల్లని నీటితో తలస్నానం చేస్తే మంచి ఒత్తయిన జుట్టు రావడం ఖాయం.
మందారం పువ్వుతో కూడా జుట్టు సంరక్షించుకోవచ్చు. పది మందార పువ్వులు తీసుకుని పేస్ట్ చేసి, దానికి ఆముదం కలిపి తలకు పట్టించాలి. 20 నుండి 30 నిమిషాలు ఉంచి చల్లని నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు మృదువుగా ఉండటంతో పాటు బలంగా ఉండి, ఒత్తుగా పెరుగుతుంది.
జుట్టు బలంగా ఉండటానికి, పెరగడానికి ఆముదం, ఉసిరి నూనెను తీసుకుని రాత్రి సమయంలో జుట్టుకు రాయాలి. మాడకు బాగా మర్దనా చేయాలి. అలా చేసి ఉదయానే షాంపూతో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల తప్పకుండా ఉపయోగం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు సలహా ఇస్తున్నారు.