చాలా మంది అధిక పొట్టతో బాధపడుతుంటారు. కొందరు ఊబకాయంతో బాధపడుతుంటే... మరికొందరు అతిగా ఆరగించడం వల్ల వచ్చిన పొట్టతో బాధపడుతుంటారు. ఇలాంటి వచ్చిన పొట్టను తగ్గించుకునేందుకు ఎన్నో కష్టాలు పడుతుంటారు. ఏవేవో పద్ధతులను పాటిస్తూ సమయం వృథా చేసుకుంటుంటారు. వాస్తవంగా ఇలాంటి వారు వంటింట్లో ఉండే వస్తువులతో పొట్ట తగ్గించుకోవచ్చు. ఆ గృహ చిట్కాలేంటో పరిశీలిద్ధాం.
ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో 2 టేబుల్ స్పూన్ల తేనెను వేసి బాగా కలిపి ఆ ద్రవాన్ని ఉదయాన్నే పరగడుపున తాగితే పొట్ట దగ్గరి కొవ్వు కరిగిపోతుంది. ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో 2 టీ స్పూన్ల తేనె, 1/4 టీస్పూన్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పొడిలను కలిపి అనంతరం వచ్చే ద్రవాన్ని వడకట్టి తాగితే పొట్ట తగ్గే అవకాశం ఉంది.
ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో అవిసె గింజల పొడి ఒక టీ స్పూన్, ఒక టీస్పూన్ తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు తాగితే పొట్ట దగ్గరి కొవ్వు చాలా త్వరగా తగ్గిపోతుంది. ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో కొంత నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఉదయాన్నే పరగడుపున ఈ మిశ్రమం తాగితే అధికంగా ఉన్న పొట్ట తగ్గిపోతుంది.