నిద్రపట్టలేదని.. నిద్రమాత్రలు వేసుకుంటున్నారా...

బుధవారం, 26 జులై 2017 (15:36 IST)
ప్రపంచ వ్యాప్తంగా చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. కోట్లాదిమంది ప్రజలు నిద్రలేకపోవడంతో నిద్రమాత్రలను వాడుతున్నారు. ఈ సమస్యపై వైద్యులు పరిశోధనలు చేస్తే నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. నిద్రమాత్రలులు తరచూ వేసుకునే వారిలో గుండెపోటు, కేన్సర్, మతిమరుపు, స్పృహ కోల్పోవడం, ఎముకలు బలం తగ్గిపోవడం జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. 
 
శారీరక శ్రమ లేని వారికి నిద్రలేమి సమస్య సహజంగానే ఉంటుందని, నడకలాంటి తేలికపాటి వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. వ్యాయామం చేసేవారికి, శారీరక శ్రమ చేసే వారికి సహజంగా నిద్రవస్తుందని వైద్యులు చెబుతున్నారు. వారానికి కనీసం 150 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే చక్కటి ఫలితాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి