ఈ ఆరు ఆహారాలు తింటే.. బరువు పెరగరట..?

గురువారం, 25 ఏప్రియల్ 2019 (10:49 IST)
సాధారణంగా ఏ పదార్థాలు అధికంగా తింటే బరువు పెరుగుతారన్న విషయం అందరికి తెలిసే ఉంటుంది. కానీ అధిక బరువును తగ్గించే ఆహార పదార్థాలేమిటన్ని విషయం చాలామందికి తెలియకపోవచ్చును. ఆరురకాల ఆహారాలు తీసుకోవడం వలన బరువు పెరగరని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. మరి ఆ ఆరురకాల ఆహారాలేంటో ఓసారి తెలుసుకుందాం..
 
1. దానిమ్మ గింజలు ఎన్ని తిన్నా మంచిదే అని చెప్తున్నారు నిపుణులు. కొన్ని గింజలు తిన్నా కడుపు నిండిన భావన కలిగి ఆహారం తీసుకోవాలన్న కోరిక నశించిపోతుంది. 
 
2. ఆహారపదార్థాల తయారీకి ఆలివ్ నూనె ఉపయోగిస్తే మంచిదని వారు చెప్తున్నారు. ఈ నూనెలోని మోనో శాచ్యురేటే ఫ్యాటీ యాసిడ్స్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను కాపాడుతాయి. కాబట్టి బరువు పెరిగే సమస్యే లేదు. 
 
3. ఉడికించిన కోడిగుడ్డు తింటే బరువు తగ్గుతారట. దీనిలోని ల్యూసిన్ అనే అమైనో యాసిడ్ బరువు తగ్గించడానికి సహాయపడుతుందట. గుడ్డులోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ వంటి ఖనిజాలు అధిక బరువు తగ్గించేందుకు ఎంతగానో దోహదపడుతాయి. 
 
4. పచ్చని కాయగూరలు, ఆకుకూరల్లే నీటి శాతం ఎక్కువగా ఉండడం వలన త్వరగా కడుపు నిండినట్టు అనిపిస్తుంది. కాబట్టి ముదురు ఆకుపచ్చ రంగుల్లో ఉండే కూరగాయలను ఎక్కువగా తింటే బరువు పెరగరు. 
 
5. చేపల్లో కొవ్వు ఉండదు. వీటిల్లో క్యాలరీలు చాలా తక్కువ. కాబట్టి మాంసాల జోలికి పోకుండా వీలైనంత ఎక్కువగా చేపలు తింటే నాన్‌వెజ్ తిన్న ఫీలింగూ ఉంటుంది. బరువు పెరగరు. 
 
6. వెజిటబుల్ సూప్స్ వలన కూడా క్యాలరీలు పెద్దగా పెరగవు. పైగా భోజనం ముందు వాటిని తాగితే కడుపు నిండినట్టు అనిపించి ఎక్కువ తినం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు