సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి సమక్షంలో గంగాధర శాస్త్రి పండిత గోష్ఠి

దేవీ

బుధవారం, 21 మే 2025 (18:01 IST)
Siddheshwarananda Bharathi Mahaswami, Gangadhara Shastri
కుర్తాళం శంకరాచార్యులు, శ్రీ సిద్ధేశ్వరీ పీఠాధిపతులు, మహిమాన్విత మంత్రస్వరూపులు, నడిచే దైవం, పరమహంస పరివ్రాజకాచార్య   శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామివారిని తిరుపతికి సమీపంలోని, రాయల చెరువు లోని శ్రీ శక్తీ పీఠం లో ఇటీవలే దర్శనం చేసుకున్నారు.

ప్రసిద్ధ గీతా గాన ప్రవచన ప్రచారకర్త, 'భగవద్గీతా ఫౌండేషన్' వ్యవ వస్ధాపక అధ్యక్షులు డాII ఎల్. వి. గంగాధర శాస్త్రి మరియు 'భగవద్గీతా ఫౌండేషన్' అమెరికా శాఖ వ్యవస్థాపకుడు ఎల్ విశ్వతేజ..! సిద్ధేశ్వరానంద మహాస్వామి వారికి గంగాధర శాస్త్రి తమ 'భగవద్గీతా ఫౌండేషన్' కార్యక్రమాలను వివరించారు. 
 
ఆనాడు జరిగిన పండిత గోష్ఠి  లో శ్రీ గంగాధర శాస్త్రి భగవద్గీత లోని 'విశ్వరూప సందర్శన యోగ' వైశిష్ట్యాన్ని వివరిస్తూ కొన్ని శ్లోకాలను తాత్పర్య సహితం గా గానం చేశారు. శ్రీమాన్ 'మా'శర్మ గారి నేతృత్వం లో ఈ కార్యక్రమం జరిగింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు