హాలీవుడ్ అవార్డుల పంపిణీ పండుగ ఆస్కార్ 2020 లాస్ ఏంజెల్స్‌లో డాల్బీ థియేటర్‌లో కన్నులపండుగగా జరిగింది. హాలీవుడ్ తారలతో పాటు పలు దేశాలకి చెందిన నటీనటుల సమక్షంలో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రపంచంలోని తారలందరూ ఒకే చోట చేరడంతో ఆ ప్రాంగణం శోభాయమానంగా మారింది.
92వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో పలు విభాగాలకి సంబంధించి అవార్డులని ప్రధానం చేస్తున్నారు. ఉత్తమ యానిమేటేడ్ షార్ట్ ఫిలింగా హెయిర్ లవ్ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ దక్కగా, ఉత్తమ సహాయ నటుడిగా బ్రాడ్‌పిట్ (వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్), బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిలింగా టాయ్ స్టోరీ చిత్రాలు అవార్డులని దక్కించుకున్నాయి.
కాగా, ఆస్కార్ కిరీటం అందుకునేందుకు మొత్తం తొమ్మిది చిత్రాలు బరిలో నిలిచాయి. వాటిలో జోకర్, పారాసైట్, 1917, మ్యారేజ్ స్టోరీ, ది ఐరిష్ మ్యాన్, జోజో రాబిట్, లిటిల్ ఉమెన్, ఫోర్డ్ వర్సెస్ ఫెరారి, ఒన్స్ ఎపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ చిత్రాలు ఉన్నాయి. ఆస్కార్ 2020 అవార్డులను గెలుచుకున్న చిత్రాల జాబితాను పరిశీలిస్తే,
ఉత్తమ చిత్రం - పారాసైట్
ఉత్తమ డైరెక్టర్ - బోన్ జోన్ హో (పారాసైట్)
ఉత్తమ నటి - రెనీ జెల్వెగర్ (జూడి)
ఉత్తమ నటుడు - జాక్విన్ ఫొనిక్స్ (జోకర్)
ఉత్తమ సపోర్టింగ్ నటి - లారా డెర్న్ (మ్యారేజ్ స్టోరీ)
ఉత్తమ సపోర్టింగ్ నటుడు- బ్రాడ్‌పిట్ (వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్)