ఐదు రూపాయల కొత్తిమీర కట్టతో కిడ్నీలు శుద్ధి... ఎలా?

బుధవారం, 18 జనవరి 2017 (10:01 IST)
శరీర అవయవాల్లో కిడ్నీలు (మూత్రపిండాలు) ఎంతో ముఖ్యమైనవి. శరీరంలోని విషపూరిత లవణాలు, చెమటను శరీరం నుంచి బయటకు పంపించి వేస్తూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాంటి కిడ్నీల పట్ల అశ్రద్ధ చేస్తే.. మూత్రపిండాల్లో రాళ్లు చేరడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కిడ్నీల్లో చేరిన రాళ్లను తొలగించుకోవాలంటే లక్షలాది రూపాయలను ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే, ఇంటిపట్టునే ఉంటే మూత్ర పిండాలని శుద్ధి చేసుకోవచ్చు. అదీ కూడా ఐదు రూపాయల విలువ చేసే కొత్తిమీర కట్టతో. అదెలాగో చూద్ధాం. 
 
ఐదు రూపాయల విలువ చేసే కొత్తిమీర కట్టను తీసుకుని దాన్ని చిన్నచిన్న ముక్కలుగా కత్తిరించి... శుభ్రంగా నీటిలో కడగాలి. ఆ తర్వాత ఆ కొత్తిమీర ముక్కలను 2 లీటర్ల నీటిలో బాగా మరింగించాలి. ఈ నీటిని చల్లార్చి.. ఓ బాటిల్‌లో పోసుకుని ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి. ఈ రసాన్ని ప్రతి రోజూ ఒక గ్లాసుడు చొప్పున తాగినట్టయితే కిడ్నీలు శుభ్రపడటమే కాకుండా కిడ్నీల్లోని రాళ్ళు కూడా కరిగిపోతాయి. తద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చని గృహవైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. 
 
అయితే, ఈ చక్కెర వ్యాధితో బాధపడేవారు ఈ రసాన్ని తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదు. కొత్తిమీర ఆకుల్లో అధిక మోతాదుల్లో పొటాషియం ఉంటుంది. అందువల్ల కొత్తిమీరతో పాటు.. కొత్తమీర రసానికి డయాబెటిక్ పేషంట్లు దూరంగా ఉండటం మంచిది. 

వెబ్దునియా పై చదవండి