పెసల్లోని ఆరోగ్య ప్రయోజనాలను పరిశీలిస్తే.. వీటిలోని పోషక విలువలు కంటి ఆరోగ్యానికి మంచి ఔషధంగా ఉపయోగపడుతాయి. అలానే వాటి మెులకల్లో ఎంజైములు, యాంటీ ఆక్సిడెంట్స్ మరింత ఎక్కువగా లభ్యమవుతాయి. అందుచేత ప్రతిరోజూ ఆహారంతో పెసర మెులకలు తీసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవని అధ్యయనంలో తెలియజేశారు.
ఉడికించిన పెసల్లో విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ శరీరో రోగనిరోధకశక్తిని పెంచుటకు సహాయపడుతాయి. అంతేకాకుండా వీటిలోని విటమిన్స్ హోర్మోన్లను ప్రేరేపించడంలో, పిల్లల పెరుగుదలకు తోడ్పడుతాయి. వయస్సు పెరిగిపోతుందని బాధపడకుండా రోజువారి ఆహారంలో పెసల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే వారి అసలు వయస్సు కన్నా పదేళ్లు తక్కువగా కనిపిస్తారు. ఈ పెసల్లోని కాపర్ చర్మం ముడతలు పడకుండా చేస్తుంది.
హైబీపీ రోగులకు పెసలు చాలా మంచివి. వీటిని ఉడికించే ముందుగా వాటిలో కొద్దిగా ఉప్పు వేసి ఉడికించాలి. ఇలా ఉడికిన వాటిని రోజూ సేవిస్తే హైబీపీ అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పెసల్లోని ఐరన్ శరీర అవయవాలకు కావలసిన ఆక్సిజన్ సమృద్ధిగా అందిస్తుంది. దీని ఫలితంగా జ్ఞాపకశక్తి వంటి లోపాలు తొలగిపోతాయి.
పెసల్లో క్యాలరీలు చాలా తక్కువ. వీటిల్లోని ఫైబర్ పదార్థం జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. దీని ఫలితంగా ఊబకాయం వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వెల్లడైంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. పెసల్లోని క్యాల్షియం ఎముకల బలానికి మంచిగా దోహదపడుతాయి. దాంతో వీటిలోని సోడియం అనే పదార్థం దంతాలు, చిగుళ్ల సమస్యలను నివారిస్తుంది.