పాదాల పగుళ్ళు ఓ సమస్యగా ఉందా? నివారణకు ఇంటి చిట్కాలివిగో!

శుక్రవారం, 8 జులై 2016 (11:36 IST)
అధిక శాతం మందికి పాద సంరక్షణపై పెద్దగా శ్రద్ధ ఉండదు. పగుళ్ల సమస్యను నిర్లక్ష్యం చేస్తే పాదాలు ఎర్రబారి, వాచి తీవ్రమైన నొప్పికి దారి తీస్తుంది. ఫంగల్ ఇన్ ఫెక్షన్ కూడా దారి తీయవచ్చు. అలాగే, తగినంత తేమ లేకపోవడం, ఎక్కువగా తడిలో పాదాలు నానడం కూడా ఈ సమస్యకు ఓ కారణంగా చెప్పుకోవచ్చు. 
 
ఈ తరహా సమస్య... శీతాకాలం... వేసవి కాలం.. కొందరిని వర్షాకాలంలోనూ ఈ సమస్య తీవ్రంగా వేధిస్తుంటుంది. ఈ సమస్య కారణంగా చూడడానికి పాదాలు ఎబ్బెట్టుగా కనిపిస్తాయి. స్త్రీలకు అందమైన పాదాలు ఓ పెద్ద అసెట్ అని తెలిసిందే కదా. చాలా మంది రకరకాల చిట్కాలు పాటిస్తుంటారు. మరికొందరు వైద్యుల సలహాతో వివిధ రకాల మందులు వాడినా ఆశించిన ఫలితం లేక విసుగు చెందుతారు. ఇలాంటి వారు ఇంట్లోనే చిన్నపాటి చిట్కాలు పాటిస్తే సమస్య నుంచి గట్టెక్కవచ్చు. 
 
పాదాలు పగుళ్లు ఉన్న చోట అరటి పండు గుజ్జును దట్టంగా పట్టించడం వల్ల కొంతమేరకు ఉపశమనం పొందవచ్చు. పసుపు, తులసి , కర్పూరం సమాన మొత్తాల్లో తీసుకుని వీటికి అలోవెరా జెల్ కలిపి రాసి చూస్తే మంచి ఫలితం ఉంటుంది. 
 
మైనం ఆవనూనెతో కలిపి రాత్రి పూట పగుళ్లపై రాసి చూస్తే... తెల్లవారే సరికి చాలా మార్పు కనిపిస్తుంది. గ్లిజరిన్, రోజ్ వాటర్ తో కలిపి ప్రతి రోజూ రాత్రి నిద్రించడానికి ముందు.. అలా 15 రోజుల పాటు రాసినట్టయితే ఫలితం ఉంటుంది. నిద్రించే ముందు నువ్వెల నూనెతో పాదాలకు మర్ధన చేయడం వల్ల పాదాల పగుళ్లు మటుమాయమైపోతాయి.

వెబ్దునియా పై చదవండి