సాధారణంగా చాలామందిలో వీర్యకణాల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. ఇలాంటి పురుషుల్లో సంతాన భాగ్యం తక్కువగా కలుగుతుంది. అయితే, వీర్యవృద్ధి తక్కువుగా ఉండేవారు ఓ చిన్నపాటి చిట్కాను పాటిస్తే ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు.
తగిన మోతాదులో పచ్చకర్పూరం, జాజికాయ, జాపత్రి ఈ మూడింటినీ మెత్తగా చూర్ణంగా చేసుకోవాలి. ఈ చూర్ణంలో 5 గ్రాముల ఎండు ద్రాక్ష వేసి మరోసారి నూరాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని శెనగగింజలంత మాత్రలుగా తయారు చేసుకుని, రోజూ నిద్రకు ముందు ఒక మాత్ర వేసుకుని ఓ గ్లాసు పాలు తాగితే వీర్యవృద్ధితో పాటు లైంగిక శక్తి పెరుగుతుంది.