స్తనాలు సన్నగా ఉండటం వంశపారంపర్యమా?

File
FILE
అనేక మంది మహిళల్లో స్తనాలు సన్నగా ఉంటాయి. ఇది ఒక వ్యాధిగా వారు బాధపడుతుంటారు. తోటి స్నేహితులు చేసే కామెంట్స్ కారణంగా వారు లోలోపల కుమిలిపోతుంటారు. పురుష లక్షణాల వల్ల ఇలా జరుగుతుందని ఇంకొందరు భావిస్తుంటారు. వాస్తవానికి రొమ్ములు సన్నగా ఉండటానికి వైద్యులు పలు కారణాలు చెపుతుంటారు. వంశపారంపర్యంగా తల్లి లేదా తండ్రి వైపు వారు సన్నగా ఉండటం ఒక కారణంగా పేర్కొంటున్నారు.

పౌష్టికాహార లోపం వల్ల, శోషణ సరిగా జరగక పోవడం వల్ల శరీరానికి కావలసిన ప్రోటీన్లు, విటమిన్లు, ఇతర ఖనిజాలు అందకపోవడం వల్ల, హర్మోన్లు సమతుల్యం లోపించడం, మానసి ఒత్తిడి వల్ల కూడా స్తనాలు సన్నగా ఉంటాయని వైద్యులు చెపుతుంటారు. అయితే, వీటిలో కారణాలను గుర్తించి తగిన విధంగా వైద్యం చేయించుకుంటే ఫలితం ఉంటుందని వారు వైద్యులు చెపుతున్నారు.

ఇలాంటి సమస్యలకు హోమియోలో తగిన వైద్యం ఉంటుందని వైద్యులు చెపుతుంటారు. ఈ మందులు వాడటం వల్ల శరీరానికి కావలసిన జీర్ణక్రియ, శోషణ క్రియలను సమర్థవంతంగా నిర్వహించడంలో బాగా పని చేయడమే కాకుండా రొమ్ముల పరిమాణం పెరిగేందుకు దోహదపడతాయని భావిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి