కావలసిన పదార్థాలు : పుట్టగొడుగులు... 200గ్రా. పనీర్... 50గ్రా. జీడిపప్పు... గుప్పెడు. బంగాళాదుంపలు... రెండు పచ్చిమిర్చి... 4 ఉప్పు... తగినంత కొత్తిమీర... కట్ట నిమ్మకాయ... ఒకటి
తయారీ విధానం : పుట్టగొడుగుల్ని శుభ్రం చేసి ఉడికించి తీయాలి. తరువాత గొడుగుకు రంధ్రం పడకుండా కాడను జాగ్రత్తగా తొలగించాలి. బంగాళాదుంపలు ఉడికించి పొట్టు తీసి మెత్తగా చిదమాలి. అందులోనే పనీర్ తురుము, జీడిపప్పు ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, నిమ్మరసం కలపాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తిప్పిన గొడుగులో జాగ్రత్తగా పెట్టి వాటిని అలాగే ఓవెన్లో ఉంచి ఓ రెండు నిమిషాలు గ్రిల్ చేయాలి. స్నాక్స్‌లా తినడానికి బాగుంటాయి. ఎన్నో పోషక విలువలతో పాటు, మంచి రుచితో అలరించే స్టఫ్డ్ గొడుగుల వంటకాన్ని మీరూ ఓసారి ట్రై చేయండి మరి...!