బెంగాలీ స్పెషల్ "బైంగన్‌కా బర్తా"

FILE
కావలసిన పదార్థాలు :
పచ్చడి వంకాయలు... రెండు
టొమోటోలు... నాలుగు
ఉల్లిపాయలు... మూడు
కొత్తిమీర.. ఒక కట్ట
పచ్చిమిరపకాయలు.. రెండు
కారం.. ఒక టీ.
పసుపు.. అర టీ.
పంచదార.. ఒక టీ.
దాల్చిన చెక్క.. రెండు
లంవంగాలు.. నాలుగు
ఉప్పు.. తగినంత

పోపుకోసం..
ఆవాలు.. ఒక టీ.
మెంతులు.. అర టీ.
నూనె.. ఆరు టీ.

తయారీ విధానం :
వంకాయలకి కొద్దిగా నూనె రాసి చాకుతో గాట్లు పెట్టి స్టవ్‌ మీద కాల్చి మెత్తగా అయ్యాక తీసి, పైన చల్లటి నీళ్లు చల్లి పక్కన ఉంచాలి. ఉల్లిపాయలు, టొమాటోలను సన్నగా విడివిడిగా తరగాలి. బాణలిలో నూనె వేసి లవంగాలు, దాల్చినచెక్క వేయించి తీయాలి. ఆవాలు, మెంతులు వేసి అవి కూడా వేగాక ఉల్లి ముక్కలు, పచ్చిమిరప ముక్కలు వేసి కమ్మని వాసన వచ్చేవరకూ వేయించాలి.

అందులోనే టొమాటో ముక్కలు వేసి ఉప్పు, పసుపు, పంచదార వేసి మూతపెట్టాలి. మెత్తగా అయ్యాక దించి పక్కనుంచాలి. తరువాత వంకాయల తొక్క వలిచి, వాటిని రోటిలో వేసి మెత్తగా గుజ్జులా చేసి టొమాటో ముక్కల్లో కలపాలి. లవంగాలు, దాల్చిన చెక్క పొడి చేసి వేయాలి. ఆపైన కొత్తిమీర సన్నగా తరిగి కలిపితే బెంగాలీలకు ప్రీతిపాత్రమైన "బైంగన్‌కా బర్తా" సిద్ధమైనట్లే..!

వెబ్దునియా పై చదవండి