తాటిముంజలు మన ఆరోగ్యానికచి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో విటమిన్ బి, ఐరన్, కాల్షియం వంటివి పుష్కలంగా ఉంటాయి. వేసవిలో ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ఈ ముంజలు ఎంతగానో ఉపయోగపడుతాయి. మనిషి శరీరంలోని ఉష్ణోగ్రత తగ్గి జీర్ణక్రియ బాగా జరుగుతుంది. శరీరానికి మంచి చల్లదనాన్ని అందిస్తుంది. తాటిముంజలతో మనం వంటలు కూడా చేసుకోవచ్చు. తాటిముంజలు, కొబ్బరి కలిపి కూర చేసుకుంటే ఆ రుచే వేరు. అదెలాగో చూద్దాం.
నువ్వుల పొడి- ఒక టేబుల్‌స్పూను,
నూనె- రెండు టేబుల్ స్పూన్లు,
పచ్చిమిర్చి పేస్టు- రెండు టీస్పూన్లు,
ఉప్పు-తగినంత,
ఉల్లిపాయ-ఒకటి (సన్నగా తరిగినవి),
కసూరిమేథి- అర టీస్పూను,
అల్లంవెల్లుల్లి పేస్టు- ఒక టీస్పూను,
చింతపండు గుజ్జు- తగినంత
తయారుచేసే విధానం :
కడాయిలో నూనె వేసి వేడి చేయాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ రంగులోకి వచ్చేవరకూ వేగించాలి. పసుపు, అల్లం-వెల్లుల్లి పేస్టు అందులో వేసి వేగించాలి. తర్వాత గరంమసాలా, కసూరిమేథీ, పచ్చిమిర్చి పేస్టు, టొమాటో ముక్కలు కూడా అందులో వేసి వేగించాలి.
ఈ మిశ్రమంలో పచ్చికొబ్బరి పేస్టు, నువ్వులపొడితో పాటు కొన్ని నీళ్లు పోసి ఉడికించాలి. తర్వాత పొట్టు తీసిన ముంజల ముక్కలను మిశ్రమంలో వేసి కలపాలి. అందులో చింతపండు గుజ్జు, ఉప్పు వేసి కలపాలి. ముంజలు మెత్తబడ్డ తర్వాత దానిపై కొత్తిమీర చల్లాలి. అంతే... తాటిముంజల కొబ్బరికూర రెడీ.