కాలిఫ్లవర్ కర్రీ

శుక్రవారం, 9 జనవరి 2009 (12:17 IST)
FileFILE
కావలసిన పదార్థాలు :
కాలీ ఫ్లవర్...అరకిలో
కోడి మాంసం... ఒక కిలో
వెల్లుల్లి... ఎనిమిది రెబ్బలు
కొత్తిమీర... ఒక కప్పు
కారం... తగినంత
ఉప్పు... తగినంత
కొబ్బరి పాలు... ఒక కప్పు
నూనె లేదా నెయ్యి... రెండు స్పూన్‌లు
లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్కలు... కాసిన్ని
నిమ్మరసం... ఒక టీస్పూన్

తయారీ విధానం :
బాణలిలో నూనె లేదా నెయ్యిని వేసి... నూరి ఉంచుకున్న ఉల్లిపాయలు, వెల్లుల్లి, కొత్తిమీర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్కల మసాలాలను వేసి వేయించాలి. కాసేపు వేగిన తరువాత అందులో కోడిమాంసాన్ని వేసి మరికాసేపు వేయించాలి. తరువాత కారం, ఉప్పు కలిపి తగినన్ని నీళ్ళుపోసి మాంసం ఉడికేంతవరకు ఉంచాలి.

చివరగా వేడినీటిలో అరగంటపాటు నానబెట్టి ఉంచుకున్న కాలిఫ్లవర్‌ను ఉడుకుతున్న కూరలో వేయాలి. కాసేపు ఉడికిన తరువాత కొబ్బరి పాలును పోసి కలపాలి. కూర బాగా దగ్గరికి వచ్చి నూనె పైకి తేలిన తరువాత పైన నిమ్మరసం పిండి దించేయాలి. అంతే కాలీఫ్లవర్ కర్రీ సిద్ధమైనట్లే. దీనిని వైట్‌రైస్, చపాతీ, పరోటాలకు సైడ్‌డిష్‌గా వాడుకోవచ్చు. మరి మీరూ ప్రయత్నిస్తారు కదూ...!

వెబ్దునియా పై చదవండి