కాలీఫ్లవర్ స్పెషల్ "దమ్ గోబీ మసాలా"

FILE
కావలసిన పదార్థాలు :
కాలీఫ్లవర్... ఒకటి
పెరుగు... ఒక కప్పు
శొంఠిపొడి... అర టీ.
ఉల్లిపాయలు... రెండు
పచ్చిమిర్చి... నాలుగు
కారం... ఒక టీ.
పసుపు... పావు టీ.
గసాలముద్ద... రెండు టీ.
గరంమసాలా... పావు టీ.
జీలకర్ర పొడి... ఒక టీ.
కొత్తిమీర... ఒక కట్ట
నూనె... 50 గ్రా.
ఉప్పు... తగినంత
అజినమోటో... ఒక టీ.

తయారీ విధానం :
కాలీఫ్లవర్‌ను ముక్కలుగా కోసి పది నిమిషాలపాటు నీటిలో ఉడికించి తీసి, ఓ వెడల్పాటి గిన్నెలో వేసి ఉంచాలి. ఒక గిన్నెలో పెరుగు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, కారం, పసుపు, గరంమసాలా, గసాల ముద్ద, జీలకర్ర పొడి, నూనె, ఉప్పు, అజినమోటో అన్నింటినీ వేసి కలిపి ఆ మసాలాను కాలీఫ్లవర్ ముక్కలకు పట్టించి మూతపెట్టి ఉంచాలి.

సన్నటి మంటమీద 15 నిమిషాలపాటు ఉడికించి దించేస్తే దమ్ గోబీ మసాల తయారైనట్లే...! ఇది వేడి అన్నం, చపాతీల్లోకి సూపర్‌గా ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి