కావలసిన పదార్థాలు : కొబ్బరి చెక్క... ఒకటి కందిపప్పు... ఒక కప్పు ఎండుమిర్చి... పది ఆవాలు... ఒక టీ. జీలకర్ర... ఒక టీ. నూనె... రెండు టీ. ఇంగువ, పసుపు... చిటికెడు
తయారీ విధానం : కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ముందుగా కందిపప్పును నూనె లేకుండా బాగా వేయించి, పక్కన పెట్టాలి. ఆ తరువాత నూనె, ఎండుమిర్చి వేసి తాలింపు గింజలను వేయించాలి. మిక్సీలో తాలింపు గింజలను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తరువాత కందిపప్పును కూడా వేసి మెత్తగా అయ్యేదాకా గ్రైండ్ చేయాలి. చివర్లో కొబ్బరి ముక్కలు, ఉప్పు, పసుపు కూడా వేసి మెత్తగా నూరి తీసేయాలి. అంతే కోనసీమ కొబ్బరి చట్నీ సిద్ధమైనట్లే..!