కావలసిన పదార్థాలు : మామిడి పిందెలు... పది ఆవపిండి... మూడు మెంతులు... ఒక టీ. ఉప్పు... మూడు కారం... మూడు టీ. నూనె... వంద గ్రా.
తయారీ విధానం : మామిడికాయలను శుభ్రంగా కడిగి, తడి లేకుండా తుడుచుకోవాలి. ఒక్కొక్క కాయను ఎనిమిది ముక్కలుగా చేసి పక్కన ఉంచాలి. ఆవపిండి, కారం, ఉప్పు మూడింటిలో నూనె వేసి బాగా కిందకు పైకి కలుపుకోవాలి. అందులో మామిడికాయ ముక్కలను కొద్ది కొద్దిగా వేయాలి.
చివరగా మెంతులు వేసి పైన కొద్దిగా నూనె పోసి ఒకరోజు అలాగే ఉంచాలి. అంతే జీడి ఆవకాయ రెడీ అయినట్లే..! దీన్ని రెండో రోజునుంచే వాడుకోవచ్చు. వేడి వేడి అన్నంలో కమ్మటి నువ్వుపప్పు నూనె వేసుకుని ఈ జీడి ఆవకాయను తింటే అమృతం కంటే అద్భుతంగా అనిపిస్తుంది.