కావలసిన పదార్థాలు : టొమోటోలు... అర కేజీ నువ్వులు... 200 గ్రా. ధనియాలు... వంద గ్రా. జీలకర్ర... రెండు టీ. పచ్చిమిర్చి... పన్నెండు పసుపు... అర టీ. ఉప్పు... తగినంత పంచదార... అర టీ. కొత్తిమీర తరుగు... కొద్దిగా
తయారీ విధానం : నువ్వులు, ధనియాలు, జీలకర్ర, పచ్చిమిర్చిలను నూనెలో దోరగా వేయించి పక్కన పెట్టాలి. తర్వాత అందులోనే టొమోటోలను కూడా వేసి వేయించాలి. దాంట్లోనే కాస్తంత చింతపండును కూడా కలిపి వేయించాలి. వాటికి పసుపు, పంచదార, ఉప్పును కూడా కలిపి వేగనివ్వాలి.
చివర్లో పైన వేయించుకున్న పదార్థాలన్నింటినీ కలిపి రోట్లో వేసి మెత్తగా నూరుకోవాలి. చివర్లో కొత్తిమీర తరుగుచల్లి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి ఈ పచ్చడిని వడ్డించాలి. అంతో నోరూరించే టొమోటో రోటి పచ్చడి సిద్ధమైనట్లే...!