కావలసిన పదార్థాలు : వంకాయలు... ఐదు పాలు... ఒక కప్పు ఎండుమిర్చి.... 12 జీలకర్ర, అల్లం... కొద్దిగా ఉప్పు, పసుపు... తగినంత నూనె... 50 గ్రాములు మినప్పప్పు... రెండు టీస్పూన్లు
తయారీ విధానం : వంకాయలకు పైన నూనె రాసి నిప్పులపైన కాల్చాలి. ఉడికిన తరువాత తీసి, చల్లబడ్డాక తొక్కు తీసి మెత్తగా గుజ్జు చేసుకోవాలి. పాలు మరగపెట్టి చల్లార్చి, అందులో వంకాయ గుజ్జు కలపాలి.
కొంచెం నూనెవేసి జీలకర్ర, మినప్పప్పు, మిరపకాయలు, అల్లం వేయించి మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని కూడా పాలు, వంకాయ గుజ్జుతో కలపాలి. అందులోనే సరిపడా ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. అంతే పాలతో వంకాయ పచ్చడి సిద్ధమైనట్లే..!
దీన్ని అలాగే... వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. అవసరం అనుకున్నవారు ఈ పచ్చడికి కరివేపాకు, ఆవాలతో పోపు కూడా పెట్టుకోవచ్చు.