వెరైటీ వంటకం "కడ్డూ కా దాల్చా"

FILE
కావలసిన పదార్థాలు :
శెనగపప్పు.. పావు కేజీ
సొరకాయ... అర కేజీ
ఉల్లిపాయలు.. రెండు
టొమోటోలు.. రెండు
బెల్లం... కొద్దిగా
చింతపండు గుజ్జు... రెండు టీ.
ఎండుమిర్చి.. నాలుగు
పసుపు.. ఒక టీ.
ఆవాలు.. ఒక టీ.
కరివేపాకు... ఒక కట్ట
జీలకర్ర.. ఒక టీ.
వెల్లుల్లి.. ఒక టీ.
కొత్తిమీర తురుము.. ఒక టీ.
ఉప్పు.. తగినంత
నూనె... రెండు టీ.
నెయ్యి.. 4 టీ.

తయారీ విధానం :
శెనగపప్పు కడిగి ఉడికించాలి. సొరకాయ తొక్కుతీసి ముక్కలుగా కోసి ఉంచాలి. పప్పు సగం ఉడికిన తరువాత సొరకాయ ముక్కలు వేసి పూర్తిగా ఉడికించాలి. స్టవ్‌మీద బాణలి పెట్టి నూనె వేసి కాగాక, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లి వేయాలి. ఆపై ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పసుపు వేసి మూతపెట్టి ఉడికించాలి.

ఇప్పుడు సొరకాయ ముక్కలతోపాటు ఉడికించిన పప్పు, తగినంత ఉప్పు, కాస్తం బెల్లం, చింతపండు గుజ్జును కూడా పై మిశ్రమంలో వేసి బాగా కలిపి ఓ రెండు నిమిషాలు సిమ్‌లో పెట్టాలి. చివరగా నెయ్యి, కొత్తిమీర కూడా వేసి కలిపి దించి వేడి వేడిగా అతిథులకు సర్వ్ చేయాలి. అంతే కడ్డూ కా దాల్చా సిద్ధమైనట్లే..!

వెబ్దునియా పై చదవండి