"ఈలం" పరిష్కారం భారత్ చేతులోనే ఉంది: ప్రేమచంద్ర

శ్రీలంక సమస్య పరిష్కారం భారత్ చేతుల్లోనే ఉందని ఆ దేశ పార్లమెంట్ సభ్యుడు సురేష్ ప్రేమచంద్ర తెలిపారు. శ్రీలంకలో తమిళులకు సమాన హక్కులు ఇవ్వాలని కోరుతూ మార్కిస్టు కమ్యూనిస్ట్ పార్టీ జరిపిన మహానాడులో ప్రేమచంద్ర మాట్లాడుతూ శ్రీలంకలో ఎల్టీటీఈపై పోరు ముగిసినా, తమిళుల సమస్య ఓ పరిష్కారానికి రాలేదన్నారు. ఎల్టీటీఈపై పోరుకు తర్వాతే అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయి.

శ్రీలంకలో అంతర్యుద్ధం ముగిసినప్పటికీ.. ఈ యుద్ధంలో తీవ్రంగా నష్టపోయిన ఈలం తమిళులకు మాత్రం ఇంతవరకు న్యాయం చోటు చేసుకోలేదు. అంతర్యుద్ధం కారణంగా నష్టపోయిన ఈలం తమిళులకు న్యాయం చేయాలని కోరుతూ తమిళనాడుకు చెందిన రాజకీయ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఆయన మాట్లాడుతూ తమిళులకు అధికారాలను పంచి ఇవ్వాలి. సమాన హక్కులు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి, అందులో ఈలం తమిళులకు రిజర్వేషన్లు కల్పించినట్టు ఆయన తెలిపారు.

వెబ్దునియా పై చదవండి