జాక్సన్ శరీరంపై ఎక్కడ చూసినా పచ్చబొట్లే

మైఖేల్ జాక్సన్ మరణించి మూడు నెలలు గడిచిపోయినప్పటికీ పోస్టుమార్టం రిపోర్టులో వెలుగుచూసిన వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. జాక్సన్ తన శరీరంలోని సున్నత భాగాలపై పచ్చబొట్లు పొడిపించుకున్నట్లు రిపోర్టులో తేలింది.

పెదవులు, కంటిచుట్టూ ఉండే సున్నితమైన రెప్పపు శరీరం... ఇంకా ఇతర శరీర భాగాలపై లెక్కలేనన్ని పచ్చబొట్లు మైఖేల్ శరీరంపై ఉన్నాయని రిపోర్టులో తేలింది.

జాక్సన్ పచ్చబొట్టుకు వాడేందుకు పింక్ మరియు బ్లాక్ కలర్ ఇంక్‌లను వాడినట్లు వెల్లడైంది. నల్లటి పచ్చబొట్టు రంగు రసాయనపు ఇంక్‌ల మరకలు తలలోనూ అక్కడక్కడ ఉన్నాయి. దీని ప్రభావంతోనే జాక్సన్ జుట్టు రాలిపోయి గుండులా మారిపోయి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక శరీరంపై అక్కడక్కడా రకరకాల ఆకృతులలో పచ్చబొట్టు గుర్తులు ఉన్నట్లు వైద్యులు కనుగొన్నారు. జాక్సన్ ఎడమ చెవికి 2 సెంటీమీటర్ల దూరంలో ఓ పచ్చబొట్టు గుర్తు ఉంది. మెడ, భుజాలు, వక్షఃస్థలం.. ఇలా అనేకచోట్ల పచ్చబొట్లు పొడిపించుకున్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది.

జాక్సన్ మరణించేనాటికి పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు రిపోర్టులో తేలింది. అతని గుండె సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నది. మోతాదుకు మించిన మందును సేవించడం వల్లనే జాక్సన్ మృతి చెందినట్లు నిర్థారణ అయింది.

వెబ్దునియా పై చదవండి