నకిలీ కేసులపై కోర్టును ఆశ్రయించిన సయీద్

నిషేధిత జమాదుత్ దవా తీవ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ మొహమ్మద్ సయీద్ తీవ్రవాద నిరోధక చట్టం కింద తనపై నమోదు చేసిన రెండు నకిలీ కేసులను ఎత్తివేయాలని కోరుతూ ఓ పాకిస్థాన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. గత ఏడాది ముంబయి ఉగ్రవాద దాడుల కేసులో ప్రధాన సూత్రధారిగా సయీద్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

ముంబయి దాడులకు ప్రధాన సూత్రధారి సయీద్ అని భారత్ బలంగా విశ్వసిస్తోంది. అతనిపై ముంబయి దాడులకు సంబంధించి కేసులు నమోదు చేసి, విచారణ జరపాలని భారత ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ఎటువంటి న్యాయబద్ధత, చట్టపరమైన అధికారం లేకుండా గత వారం ఫైసలాబాద్‌లో తనపై పాక్ యంత్రాంగం కేసులు నమోదు చేసిందని తాజాగా సయీద్ లాహోర్ హైకోర్టును ఆశ్రయించాడు.

వెబ్దునియా పై చదవండి