పాకిస్థాన్-భారత్ విదేశాంగ మంత్రుల చర్చలు పలప్రదంగా జరగడాన్ని పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ, ప్రధాన మంత్రి యూసఫ్ రజా గిలానీలు శుక్రవారం స్వాగతించారు. ఇరు దేశాలకు సంబంధించిన అన్ని అంశాలను పరిష్కరించుకోవడానికి చర్చల్ని కొనసాగిస్తామని వారు తెలిపారు.
న్యూఢిల్లీలో బుధవారం సమావేశమైన పాకిస్థాన్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్, భారత విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణ రెండు దేశాల మధ్య విశ్వాసాన్ని పెంపొందించే అనేక అంశాలకు అంగీకారం తెలపడంతో పాటు చర్చల ప్రక్రియను కొనసాగించాలని నిర్ణయించారు.
సమస్యల సాధనకు విదేశాంగ మంత్రులు చూపిన చొరవను జర్దారీ అభినందినట్లు జిన్హువా పత్రిక తెలిపింది. అంతకు ముందు పాక్ ప్రధాని యూసఫ్ రజా గిలానీతో భేటీ అయిన రబ్బానీ ఖర్ భారత ప్రధాని మన్మోహన్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణలతో జరిపిన చర్చల సారాంశాన్ని వివరించారు.