మీరే బృందాన్ని పంపుకోండి: షేక్ హసీనా

భారత్‌లో ప్రతిపాదిత తీపైముఖ్ డ్యామును పరిశీలించేందుకు ప్రతిపక్ష నేత ఖలీదా జియా తన పార్టీ బృందాన్ని పంపుకోవచ్చని బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా స్పష్టం చేశారు. ఈ డ్యామును పరిశీలించేందుకు అఖిలపక్ష పార్లమెంటరీ బృందాన్ని కూడా పంపుతామని పునరుద్ఘాటించారు.

భారత్‌లో బరాక్ నదిపై ప్రతిపాదిత డ్యాము ప్రాజెక్ట్‌పై రాజకీయ లబ్ది పొందేందుకు ఖలీదా జియా ప్రయత్నిస్తుందని హసీనా ఆరోపించారు. మణిపూర్ రాష్ట్రంలో ఈ ప్రాజెక్టు నిర్మించతలపెట్టారు. తమ ప్రభుత్వం రెండు బృందాల నివేదికలను పరిశీలించి, దేశ ప్రయోజనాల కోసం సరైన నిర్ణయం తీసుకుంటుందని హసీనా తెలిపారు.

ఖలీదా జియా నేతృత్వంలోని ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బీఎన్పీ) తీపైముఖ్ డ్యామును పరిశీలించేందుకు బృందాన్ని పంపాలని ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ బృందం నివేదికను పార్లమెంట్‌కు సమర్పించాలని, అదే విధంగా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ బృందం కూడా అక్కడి వెళ్లి డ్యామును పరిశీలించి నివేదిక సిద్ధం చేస్తుందని తెలిపారు. అనంతరం అవామీ లీగ్ ప్రభుత్వం దేశానికి ప్రయోజనకర నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి