బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రహ్మాన్ హత్య కేసులో మరణశిక్ష పడిన ఇద్దరు ఆర్మీ మాజీ అధికారులను పట్టుకోవడంలో ఆ దేశానికి అన్ని రకాలుగా సాయం చేస్తామని భారత్ హామీ ఇచ్చింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో కేంద్ర హోంమంత్రి పి.చిదంబరం మాట్లాడుతూ.. ముజిబుర్ హంతకులైన బంగ్లా ఆర్మీ మాజీ అధికారులు అబ్దుల్ మజీద్, మొస్లిహుద్దీన్‌లు భారత్‌లో దాక్కుని ఉండే అవకాశముందన్నారు.
వారిని నిర్బంధించి, బంగ్లాకు అప్పగించేందుకు శాయశక్తులా కృషి చేస్తామన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న మజిద్, మొస్లియుద్దీన్‌లు భారత్‌లో ఉన్నట్లయితే వారి ఆచూకీ కనుగొనాలన్నారు. ముజిబుర్ హత్యకేసులో మొత్తం 12 మంది ఆర్మీ అధికారులకు మరణశిక్ష పడగా వారిలో కొంతమందిని గత ఏడాది ఉరితీసిన విషయం తెల్సిందే.