లూనార్ ఫెస్టివల్‌లో దుండగుడి కాల్పులు.. పలువురు మృతి

ఆదివారం, 22 జనవరి 2023 (17:50 IST)
అమెరికాలో చైనా కొత్త సంవత్సర వేడుకలు రక్తసిక్తంగా మారాయి. మాంటెరీ పార్‌లో లూనార్ ఫెస్టివల్‌లో ఓ దుండగుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో పది మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది. కాల్పులు జరిపిన దుండగుడు పారిపోగా, అతన్ని పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమైవున్నారు. 
 
మూంటెరీ పార్కులో చైనా కొత్త సంవత్సర వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఓ దండగుడు తుపాకీతో ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనతో అనేక మంది మృత్యువాతపడ్డాడు. పది మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. మాంటెరీ పార్కు నగరంలో ఆసియా సంతతకి చెందిన ప్రజలు అధిక సంఖ్యలో నివసిస్తున్నారు. ఈ మాంటెరీ పార్క్ నగరం లాస్ ఏంజెల్స్‌ డౌన్‌టౌన్‌కు 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు