19 మంది పాలస్తీనా మహిళా ఖైదీలు విడుదల

శనివారం, 3 అక్టోబరు 2009 (10:21 IST)
ఇజ్రాయేల్ ప్రభుత్వం 19 పాలస్తీనా మహిళా యుద్ధ ఖైదీలను శుక్రవారం విడుదల చేసింది. ఇజ్రాయేల్ సైనికుడు తమ దేశ ప్రభుత్వానికి పంపిన వీడియో టేపును చూసిన అధికారులు పాలస్తీనా యుద్ధ ఖైదీలను విడుదల చేశారు. కాగా, ఇజ్రాయేల్ సైనియుకుడ మూడేళ్లుగా పాలస్తీనా తీవ్రవాద సంస్థ హామాస్ చేతుల్లో బందీగా ఉన్నాడు.

ఇజ్రాయేల్ సైనికుడు గిలాడ్ షాలిత్ (23)ను విడుదల చేయాలంటే పలు జైళ్లలో ఖైదీలుగా ఉన్న వారిని విడుదల చేయాలని హమాస్ షరతు విధిస్తూ వీడియోటేపును పంపింది. దీన్ని చూసిన ఇజ్రాయేల్ అధికారులు 19 మంది మహిళా యుద్ధ ఖైదీలను విడుదల చేశారు. ఈజిప్టు, జర్మనీల మధ్యవర్తిత్వంతో ఓ ఒప్పందం మేరకు షాలిత్ సజీవంగా ఉన్నట్టు హమాస్ వెల్లడించింది.

వెబ్దునియా పై చదవండి