రోడ్డుపై నడిచి వెళ్తున్నా వదల్లేదు.. కారులో ఎక్కించుకుని.. అత్యాచారం..

మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (11:25 IST)
ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై దురాగతాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా సిమ్లాలో దారుణం జరిగింది. కదిలే కారులో 19 ఏళ్ల యువతిపై అత్యాచారం చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళితే.. సిమ్లాలోని మాల్‌రోడ్డులో బాధితురాలు నడుచుకుంటూ వెళ్తుండగా ఓ కారు వచ్చి ఆగింది. ఆపై ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించుకుని తీసుకెళ్ళిన దుండగుడు.. కదిలే కారులోనేఓ వ్యక్తిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
 
ఆదివారం రాత్రి పది గంటలకు ఈ ఘటన చోటుచేసుకోగా.. సోమవారం బాధితురాలు హెల్ఫ్‌లైన్ నెంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు