ఫిలిప్పీన్స్‌‌ను కుదిపేసిన టెంబిన్- బస్సు ప్రమాదంలో 20 మంది మృతి (Video)

సోమవారం, 25 డిశెంబరు 2017 (11:31 IST)
ఫిలిప్పీన్స్‌ను టెంబిన్ అనే తుఫాను ముంచేసింది. పెను తుఫాను అయిన టెంబిన్‌ జల ప్రళయానికి 153 మంది గల్లంతయ్యారు. 182 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ తుఫాను కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారని.. వారిని ఆదుకునేందుకు చర్యలు చేపట్టినట్లు ఫిలిప్పీన్స్ ప్రభుత్వాధికారులు తెలిపారు. ఇంకా సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయని వారు వెల్లడించారు. 
 
భారీ వర్షాలతో ఒక్కసారిగా వరదలు సంభవించాయి. పెద్ద ఎత్తున మట్టి కొట్టుకురావడంతో జలప్రళయం ఏర్పడిందని అధికారులు చెప్తున్నారు. అయితే టెంబిన్ ప్రభావంతో పెను ముప్పు తప్పదని ముందస్తు హెచ్చరికలు జారీ చేసినా ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదని.. అందువల్లే ప్రాణనష్టం అధికంగా జరిగిందని ప్రభుత్వాధికారులు చెపుతున్నారు. భారీగా  కొట్టుకొచ్చిన వరద మట్టితో సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తోందని తెలిపారు.
 
మరోవైపు క్రిస్మస్ పండుగ నేపథ్యంలో ఫిలిప్పైన్స్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 20 మంది మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు వున్నారు. 

At least 200 deaths, dozens missing and 70,000 people displaced.

Tropical Storm Tembin hits the Philippines. pic.twitter.com/BlL37oSxcc

— Al Jazeera English (@AJEnglish) December 24, 2017

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు