పెంచుకున్న మహిళను తిన్న 20 పిల్లులు

మంగళవారం, 21 జూన్ 2022 (13:45 IST)
ఇంట్లో కుప్పకూలిపోయిన మహిళను తాను పెంచుకున్న 20 పిల్లులు తినేశాయి. ఈ దుర్ఘటన రష్యాలోని రోస్టోవ్‌లో జరిగినట్లు స్థానిక మీడియా తెలిపింది. వివరాల్లోకి వెళితే.. 20 పిల్లులను అల్లారు ముద్దుగా పెంచుకున్న మహిళకు పిల్లులే యముడిగా మారాయి. 
 
ఏమైందో ఏమో కానీ ఆ మహిళ ఒక్కసారిగా ఇంట్లోనే కుప్పకూలి చనిపోయింది. దీంతో పిల్లులకు ఆహారం పెట్టేవారు లేక ఒంటరిగా మిగిలిపోయాయి. 
 
పిల్లులకు ఆహారం లేక.. చనిపోయి పడి ఉన్న తమ యజమానినే తిన్నాయని పిల్లులను రక్షించిన వ్యక్తి మీడియాకు తెలిపారు. అయితే ఆమె మరణించిన రెండు వారాల తర్వాత పాక్షికంగా పిల్లులు తిన్న మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు