గత ఫిబ్రవరి నెలలో ప్రారంభమైన ఉక్రెయిన్ - రష్యా యుద్ధం ఇంకా కొనసాగుతోంది. నెలలు గడిచిపోతున్నప్పటికీ ఈ యుద్ధానికి అంతం అనేది కనిపించడం లేదు. ఈ క్రమంలో తాజాగా ఉక్రెయిన్ రైల్వే స్టేషన్‌పై రష్యా క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో 22 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.
మరోవైపు, ఉక్రెయిన్ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తమపై రష్యా ఎన్ని దాడులు చేసినా వెనుకంజ వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. 2014లో రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియాతో పాటు ఇతర ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుంటామని తెలిపారు.