జర్మనీ, చెక్ రిపబ్లిక్, నార్వే-హంగేరీ, భారత్‌కు చెందిన రాయబారులను వెనక్కి పిలిచినట్లు అధ్యక్ష అధికారిక వెబ్‌సైట్‌లో రాసుకొచ్చారు. అయితే, వారికి వేరే బాధ్యతలు అప్పగిస్తారా? లేదా? అనే విషయం తెలియాల్సి ఉంది.
గత ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించిన తర్వాత ప్రపంచదేశాల మద్దతు కూడగట్టాలని జెలెన్‌స్కీ ఆయా దేశాల్లోని తమ రాయబారులను ఆదేశించారు. అయితే, కొన్ని దేశాలు వారి దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రష్యా దాడిని బహిరంగంగా ఖండించడానికి ముందుకు రాలేదు.