'వాషింగ్టన్ పోస్ట్ 'రిపోర్టర్ మేరీ జోర్డాన్ , మెలానియా ట్రంప్ జీవితకథతో 'ది ఆర్ట్ ఆఫ్ హర్ డీల్ ' పేరిట పుస్తకం రాసి విడుదల చేశారు. ఈ పుస్తకం గురించి మేరీ జోర్దాన్ మాట్లాడుతూ.. ' తన తల్లికి దక్కాల్సిన ఫస్ట్ లేడీ టైటిల్‌ను సవతితల్లి అయిన మెలానియా అనుభవించడం ఏంటని ఇవాంకా ప్రశ్నించారు.
అంతేకాదు 'ఫస్ట్ లేడీస్ ఆఫీస్' పేరును 'ఫస్ట్ ఫ్యామిలీస్ ఆఫీస్' గా మార్చేందుకు ఆమె ప్రయత్నించారు. అయితే , ఇవాంకా ప్రయత్నాలను మెలానియా సమర్థవంతంగా అడ్డుకున్నారు. ప్రస్తుతం ట్రంప్‌కు మెలానియా సింగిల్ మోస్ట్ ఇన్ ఫ్లూయన్షియల్ అడ్వయిజర్' అని జోర్డాన్ తెలిపారు. కాగా , ఈ పుస్తకం ప్రస్తుతం మార్కెట్‌లోకి వచ్చింది. కానీ ఈ పుస్తకంలో అవాస్తవాలే ఎక్కువ వున్నాయని ఇవాంకాకు మద్దతిచ్చేవారు ఆరోపిస్తున్నారు. మరి ఈ పోరు ఏ వివాదానికి దారి తీస్తుందో వేచి చూడాలి.