ఆప్ఘనిస్తాన్ దేశాన్ని తాలిబన్ తీవ్రవాదులు ఆక్రమించుకున్నారు. దీంతో ఆ దేశంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొనివున్నాయి. ముఖ్యంగా, ఆప్ఘన్ పౌరులే తండోపతండాలుగా దేశం వీడి వలస వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆప్ఘన్‌లో జర్నలిస్టులు దేశం వదిలి వెళ్ళిపోయేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
అమెరికా, నాటో బలగాల ఉపసంహరణ తర్వాత అఫ్గాన్‌లో చోటుచేసుకుంటున్న పరిస్థితులతో యావత్ దేశాలు ఆందోళనకు గురవుతున్నాయి. ఇప్పటికే చాలా దేశాలు తమ పౌరులను తరలించే ప్రక్రియను ముగించగా.. మరికొన్ని దేశాలు ఆగస్టు 31నాటికి పూర్తి చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.