కరోనా వైరస్‌ను మేము పుట్టించలేదు.. దోషిగా చిత్రీకరించొద్దు.. చైనా

గురువారం, 26 మార్చి 2020 (17:29 IST)
కరోనా వైరస్‌ను చైనా కావాలనే సృష్టించిందని .. ఇతర దేశాలపై ప్రయోగం కోసం తయారు చేసే క్రమంలో అది దారి తప్పిందన్న ప్రచారం సాగింది. కరోనా వైరస్ కారణంగా చైనాలో 3,200 మందికి పైగా మరణించారు. 82వేల పాజిటివ్ కేసులు ఇంకా చైనాలో ఉన్నాయి. తాజాగా ఈ అంశంపై స్పందించిన చైనాకరోనా వైరస్‌ను చైనా తయారు చేయడంగానీ, ఉద్దేశపూర్వకంగా వ్యాపించేలా చేయలేదని స్పష్టం చేసింది. 
 
కరోనా వైరస్‌ను కొందరు చైనీస్‌ వైరస్, వుహాన్‌ వైరస్‌‌గా పిలవడాన్ని ఆ దేశం తప్పుబట్టింది. కరోనాను తాము పుట్టించలేదని.. దానిమూలాలు ఎక్కడ నుంచి వచ్చాయో కనుగొంటున్నామని పేర్కొంది. కరోనా ప్రభావం చైనాపై కూడా చాలా ఎక్కువగానే ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసింది. కావాలనే కొందర చైనాను దోషిగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించింది. 
 
ఇలాంటి ఆరోపణలు చేయడం మాని.. కరోనాను ఎదుర్కోవడంలో చైనా స్పందించిన తీరును ప్రపంచం గమనించాలని డ్రాగన్ కంట్రీ వెల్లడించింది. కరోనా వైరస్ సాధారణ ప్రక్రియలో భాగంగానే ఇది పుట్టిందని చైనా చెబుతోంది. ఇదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన ప్రకటనను చైనా గుర్తు చేస్తోంది. కానీ చైనా వాదనను మిగిలిన ప్రపంచం నమ్మడం లేదు. ముఖ్యంగా అమెరికా అయితే చైనా తీరుపై మండిపడుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు