ఈ యాప్ పేరు Co-WIN. ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ (eVIN)కి ఇది అప్‌గ్రేడెడ్ వెర్షన్. వ్యాక్సిన్ ప్రక్రియలో భాగమయ్యే ప్రతి ఒక్కరికీ ఈ యాప్ ఉపయోగపడుతుంది. అడ్మినిస్ట్రేటర్లు, వ్యాక్సినేటర్లు, వ్యాక్సిన్ అందుకునే వాళ్లు దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇప్పటికే వాళ్లకు డేటా మొత్తం కేంద్రం సేకరించింది. మొదటి దశలో ఆరోగ్య కార్యకర్తలకు, రెండో దశలో ఎమర్జెన్సీ వర్కర్లకు ఇస్తారు. మూడో దశలో కరోనా ప్రమాదం ఎక్కువగా పొంచి ఉన్న వారికి వ్యాక్సిన్ వేస్తారు. ఈ దశ నుంచే వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ అంతాCo-WIN యాప్ ద్వారానే నడుస్తుంది.
ఇందులో మొత్తంగా ఐదు మాడ్యూల్స్ ఉంటాయి. అడ్మినిస్ట్రేటర్ మాడ్యూల్, రిజిస్ట్రేషన్ మాడ్యూల్, వ్యాక్సినేషన్ మాడ్యూల్, బెనిఫిషియరీ అక్‌నాలెడ్జ్‌మెంట్ మాడ్యూల్, రిపోర్ట్ మాడ్యూల్ ఉంటాయి.