గత 2021 ఫిబ్రవరి నుంచి 91 దేశాల్లో బీఎఫ్ 7 వేరియంట్ ఉంది. జన్యు సంబంధ, మ్యుటేషన్ ప్రొఫైల్‌ను పోలిన రకం. దీనికి బీఎఫ్ 7గా (బీఏ 5.5.1.7)గా నామకరణం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ వేరియంట్ రేటు 0.5 శాతంగా ఉందని హెచ్చరించింది.
అయితే, ఎన్నో దేశాల్లో గత 22 నెలలుగా బీఎఫ్ 7 వేరియంట్ ఉన్నప్పటికీ కరోనా కేసులు గణనీయంగా పెరగలేదు. దీని వ్యాప్తి రేటు 0.5 శాతంగానే ఉన్నందున, దీనికి పరిమిత వృద్ధి సామర్థ్యమే ఉన్నట్టు తెలుస్తోంది" అని ఓ వైరాలజిస్టు అభిప్రాయపడ్డారు.
అయితే, మన దేశంలో బీఏ 5 (దీన్నుంచి వచ్చిన ఉప రకమే బీఎఫ్ 7) సైతం తక్కువ వ్యాప్తిని కలిగించింది. మరి చైనాలో అంత తీవ్ర ఎందుకంటే.. అక్కడ ప్రజల్లో కరోనా ఇన్ఫెక్షన్ రేటు చాలా తక్కువగా ఉంది. టీకాల సామర్థ్యత తక్కువ. ఒక్కసారిగా జీరో కోవిడ్ పాలసీ ఎత్తివేయడంతో ఈ వైరస్ వ్యాప్తి తీవ్ర స్థాయికి చేరుకుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.