హెచ్ 1బీ వీసీల విషయంపై అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. తాను ఎప్పుడైనా హెచ్ 1బీ వీసాలకు అనుకూలమేనని తేల్చి చెప్పారు. టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విటర్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్, భారత అమెరికన్ వివేక్ రామస్వామి సహా పలువురు రిపబ్లికన్ పార్టీ కీలక నేతలు.. హెచ్ 1బీ వీసాల ద్వారా అందించే చట్టబద్ధమైన వలసలకు మద్దతును ప్రకటించారు.
అయితే పలువురు రిపబ్లికన్ పార్టీ నేతలు మాత్రం ఇవి అక్రమమని వాదిస్తున్నారు. అమెరికా ఫస్ట్ నినాదానికి ఇది వ్యతిరేకం అంటున్నారు. దీనిపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్.. నైపుణ్యం కలిగిన కార్మికులు, ఉద్యోగులు అమెరికాకు రావడానికి జారీ చేసే ప్రత్యేక వీసా ప్రోగ్రాంకు తాను మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఎల్లప్పుడూ తాను హెచ్1 బీ వీసాలు జారీ చేయడానికి అనుకూలమేనని తేల్చి చెప్పారు. ఇందు కోసమే అమెరికాలో ఆ హెచ్ 1బీ వీసాలు ఉన్నాయని తెలిపారు. అమెరికాలో గ్రాడ్యుయేట్‌లలో నైపుణ్యం తక్కువగా ఉంటుందని.. అందుకే నైపుణ్యం కలిగిన వారిని ఇతర దేశాల నుంచి అమెరికాలోకి అనుమతించడానికి హెచ్ 1బీ వీసాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.