ఈ క్రమంలో ఆమె తల్లి అక్కడికి వెళ్లి చూడగా, ఆ పిల్లిని కొండచిలువ మింగినట్లు గుర్తించింది. దీంతో వారు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అధికారులు కొండచిలువను బంధించారు. అయితే దాని కడుపులో ఉన్న కొండచిలువను బయటకు తీయడం కష్టమని అధికారులు చెప్పడంతో.. ఆ కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు.