తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఫ్లొరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌కు చెందిన ఎమిలీ అనే ఓ మహిళ... విప్పేసిన బట్టలను ఉతికేందుకు బట్టలను వాషింగ్ మెషీన్‌లో వేసింది. వీటిలో బెడ్‌షీట్లు, ఇతర బట్టలు ఉన్నాయి. కొద్దిసేపటి తర్వాత వాషింగ్ మెషీన్ ఆన్‌చేసి పెట్టేసింది.
ఈ బట్టలన్నీ ఉతికిన తర్వాత బెడ్‌షీట్లను ఆరేయడానికి డోర్ ఓపెన్ చేసి రంగురంగులుగా కనిపిస్తున్న షీట్ మెషీన్ నుంచి బయటకు లాగింది. అది కాస్త వెచ్చగా, మందంగా, బరువుగా ఉండటంతో గుండె లబోదిబో కొట్టుకోవడం ప్రారంభమైంది.
కొండచిలువ వాషింగ్ మెషీన్‌లోకి ఎలా దూరిందో ఇప్పటికీ అంతుచిక్కడం లేదు. డోర్లన్నీ మూసేసున్నాయి. ఇంతపెద్దది ఎవరికీ కనిపించకుండా లోపలికి రావడం గమనార్హం అంటున్నారు. ఇది జరిగి చాలాసేపు అయినా మహిళ కాళ్లు, చేతులు వణుకుతున్నాయి. ఈ ఘటన ఫ్లొరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లో చోటుచేసుకుంది.