కరోనా సంక్షోభం మొదలైన నాటి నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ ఆరోగ్య సంస్థపై తరుచూ మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సదరు సంస్థకు తాత్కాలికంగా నిధులను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిషేధం శాశ్వతమవుతుందని కూడా కొంత కాలం తరువాత హెచ్చరించారు. తాజాగా డబ్ల్యూహెచ్‌తో అన్ని సంబంధాలనూ అమెరికా తెంచేసుకుంటున్నట్టు ట్రంప్ ప్రకటించారు.
అయితే డబ్ల్యూహెచ్‌వోతో అమెరికా అన్ని సంబంధాలు తెంచుకుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించడంపై జర్మనీ మండిపడింది. అమెరికా వైఖరి ప్రపంచ ప్రజల ఆరోగ్యానికి పెద్ద దెబ్బ అని జర్మనీ ఆరోగ్య శాఖ మంత్రి అన్నారు. ప్రస్తుత కాలంలో డబ్ల్యూహెచ్‌ఓ ప్రభావం చూపించేందుకు ఈ మార్పులు అవసరమని కూడా ఆమె కామెంట్ చేశారు.