సూపర్ మార్కెట్‌లో రాకాసి బల్లి.. భయంతో పరుగులు తీసిన కస్టమర్లు!

గురువారం, 8 ఏప్రియల్ 2021 (13:13 IST)
ఓ సూపర్ మార్కెట్‌లో రాకాసి బల్లి ప్రత్యక్షమైంది. దీన్ని చూసిన కస్టమర్లు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ సంఘటన థాయ్‌లాండ్ దేశంలో జరిగింది. ఎండ వేడిమిని తట్టుకోలేక ఆ రాకాసి బల్లి శీతలీకరణ సౌకర్యం కలిగిన సూపర్ మార్కెట్‌లోకి వచ్చి చేరింది. 
 
ఈ రాకాసి బల్లి 8 అడుగుల పొడవు, భారీ శరీరంతో ఉంది. ఈ బల్లిని చూడగానే కస్టమర్లు భయపడ్డారు. కేకలు వేయడంతో ఆ రాకాసి బల్లి కూడా హడలిపోయింది. మనుషులు తనకి హాని చేస్తారేమోనన్న భయంతో అది సూపర్‌ మార్కెట్లోని ర్యాక్‌‌లపై ఎక్కి గోడ మీదకు చేరింది. 
 
దీన్ని కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టడంతో వైరల్‌‌గా మారింది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఈ రాకాసి బల్లిని బంధించి అడవుల్లో విడిచిపెట్టినట్లు తెలుస్తోంది. ఇంత భారీ దేహంతో భయానకంగా కనిపించినా ఈ రాకాసి బల్లులతో ఎలాంటి ప్రాణహాని ఉండదంటున్నారు జంతుప్రేమికులు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు