ప్రపంచ దేశాలు కరోనా అంటేనే జడుసుకుంటున్నాయి. టీకా ఎప్పుడొస్తుంది బాబోయ్ అంటూ తలపట్టుకుంటున్నారు. ఇప్పటికే బ్రిటన్ ఫైజర్ టీకా వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రష్యా, చైనా ఇప్పటికే తమ దేశంలో టీకాని తీసుకువచ్చాయి. కొన్ని దేశాలు ఈ టీకాపై పరిశోధన చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తర కొరియా దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తమ దేశంలోకి కరోనా రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఇందులో భాగంగా ప్రస్తుతం కరోనా టీకా తీసుకున్నారు అని తెలుస్తోంది. కిమ్ జాంగ్ ఉన్, చైనాలో తయారైన ఓ టీకాను తీసుకున్నారట. కిమ్ కుటుంబీకులు, ముఖ్యమైన అధికారులు కూడా వ్యాక్సిన్‌ను వేయించుకున్నారని తెలుస్తోంది.