డాక్టర్ ప్రీతమ్ అనే వ్యక్తి కరాచీలోని లఖ్వానీ గార్డెన్ ఈస్ట్‌లో నివసిస్తున్నాడు. ఈయన తన ఇంటికి సమీపంలోనే ఓ క్లినిక్ నడుపుతున్నాడు. ఈయన తన క్లినిక్ నుంచి బయటకు వస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపారు. ఈ హత్యకు మతపరమైన భావజాలమే కారణంగా భావిస్తున్నారు.
దీనిపై డాక్టర్ కుమారుడు మాట్లాడుతూ డాక్టర్ ప్రీతమ్ క్లినిక్ నుంచి ఇంటికి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై దాడి చేశారని తెలిపారు. తన తండ్రి సెల్‌ఫోన్ నుంచి తనకు కాల్ వచ్చిందని, ఆయనను హత్య చేసినట్లు చెప్పారని తెలిపారు. తన తండ్రికి ఎవరితోనూ శత్రుత్వం లేదని, బెదిరింపులు కూడా రాలేదని చెప్పారు. ముందస్తు పథకం ప్రకారమే దాడి జరిగిందని తెలిపారు. దాడి జరిగిన సమయంలో విద్యుత్తు సరఫరా లేదని పేర్కొన్నారు.